Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 69

Dasaratha arrives in Mithila !!

|| om tat sat ||

బాలకాండ
ఏకోన సప్తతితమ స్సర్గః
( దశరథమహారాజు సపరివారముగా మిథిలా నగరము చేరుట)

తతో రాత్ర్యాం వ్యతీతాయాం సోపాధ్యాయస్సబాంధవః |
రాజా దశరథో హృష్టః సుమంత్రం ఇదమబ్రవీత్ ||

స|| తతః వ్యతీతాయాం రాత్ర్యాం హృష్ఠః రాజా దశరథః స ఉపాధ్యాయబాంధవః సుమంతం ఇదం అబ్రవీత్ |

తా|| పిమ్మట రాత్రి గడిచిన తరువాత హర్షముతో దశరథ మహారాజు తన ఉపాధ్యాయులు బంధువులతో కూడినవాడై సుమంతునితో ఇట్లు పలికెను.

అద్యసర్వే ధనాధ్యక్షాః ధనమాదాయ పుష్కలమ్ |
వ్రజం త్వగ్రే సువిహితా నానారత్నసమన్వితాః ||
చతురంగ బలం చాపి శీఘ్రం నిర్యాతుసర్వశః |
మమాజ్ఞాసమకాలం చ యాన యుగ్యం అనుత్తమమ్ ||

స|| ఆద్య సర్వే ధనాధ్యక్షాః పుష్కలమ్ ధనం ఆదాయ వజ్రం త్వగ్రే సువిహితా నానారత్న సమన్వితాః సర్వశః నిర్యాతు ఇతి మమ ఆజ్ఞా| సమకాలం చతురంగ బలం చ యానయుగ్యం అనుత్తమమ్ చ శీఘ్రం ( నిర్యాతుమ్ ఇతి )|

తా|| ఇవాళ ధనాధ్యక్షులు పుష్కలముగా ధనమును తీసుకొని , వజ్రములు అనేకవిథములైన రత్నములతో సర్వసన్నద్ధులై ముందుగా వెళ్ళవలెను. అలాగే చతురంగబలములతో వివిధ వాహనములు శీఘ్రముగా పోవలెను అని నాఆజ్ఞ.

వసీష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః |
మార్కండేయ స్సుదీర్ఘాయు ఋషిః కాత్యాయనస్తథా ||
ఏతే ద్విజాః ప్రయాం త్వగ్రే స్యందనం యోజయస్వ మే |
యథా కాలాత్యయో న స్యాత్ దూతా త్వరయంతి మామ్ ||

స|| ఏతే ద్విజాః వసిష్ఠః వామదేవశ్చ జాబాలిః కాశ్యపః సుదీర్ఘాయుః మార్కండేయః చ తథా కాత్యాయనః అగ్రే స్యందనం యోజయస్వ | దూతాః మాం త్వరయన్తి యథా కాలాత్యయౌ న్ స్యాత్ |

తా|| బ్రాహ్మణులగు వశిష్ఠుడు , వామదేవుడు, జాబాలి ,కాశ్యపుడు దీర్ఘాయువు కల మార్కండేయుడు అలాగే కాత్యాయనుడు ముందుగా పోవుదురు గాక. దూతలు నన్ను కాలము దాటకూడదని నన్ను త్వరపెట్టుచున్నారు.

వచనాత్తు నరేంద్రస్య సా సేనా చతురంగిణీ |
రాజానమ్ ఋషిభిస్సార్థం వ్రజంతం పృష్ఠతోs న్వగాత్ ||

స|| నరేన్ద్రస్య వచనాత్ సా చతురంగిణీ సేనా రాజానమ్ ఋషుభిః సార్థం పృష్ఠతో అన్వగాత్ ||

తా||ఆ రాజు వచనములతో ఆ చతురంగ బలములు కల ఆ సేనా ఋషులతో కూడి ఆయనను అనుసరించెను.

గత్వా చతురహం మార్గం విదేహానభ్యుపేయవాన్ |
రాజాతు జనక శ్శ్రీమాన్ శ్రుత్వా పూజామకల్పయత్ ||

స|| మార్గం చతురహం గత్వా విదేహాన్ అభ్యుపేయవాన్ | శ్రీమాన్ జనకః శ్రుత్వా రాజా పూజామ్ అకల్పయత్ తు ||

తా|| నాలుగు దినములు మార్గములో పోయి విదేహనగరము చేరిరి. శ్రీమంతుడగు జనకుడు ( దశరథ మహరాజు ) రాజు వచ్చుటవిని రాజుకి ( ఎదురేగి) పూజలు చేసెను.

తతో రాజానమాసాద్య వృద్ధం దశరథం నృపమ్|
జనక ముదితో రాజా హర్షం చ పరమం యయౌ ||

స|| తతః వృద్ధం దశరథం నృపమ్ ఆసాద్య ముదితః రాజా జనకః పరమం హర్షం యయౌ ||

తా|| అప్పుడు వృద్ధుడగు దశరథ మహారాజునకి సంతోషపడిన జనక మహారాజు ఎదురుగా వచ్చి తన హర్షమును ప్రకటించెను.

ఉవాచ నరశ్రేష్ఠో నరశ్రేష్ఠం ముదాన్వితః |
స్వాగతం తే మహారాజ దిష్ట్యాప్రాప్తోs సి రాఘవ ||
పుత్త్రయోరుభయోః ప్రీతిం లప్స్యసే వీర్య నిర్జితామ్ |||

స|| ముదాన్వితః నరశ్రేష్ఠః ( జనకః) నరశ్రేష్ఠం( దశరథం) ఉవాచ | మహరాజ! స్వాగతం తే | దిష్ట్యా ప్రాప్తోsసి|హే రాఘవ వీర్య నిర్జితామ్ పుత్రయోః ఉభయోః ప్రీతిం లప్స్యసే ||

తా|| ఆనందించుచున్న ఆనరశ్రేష్ఠుడు ( జనకుడు) ఆ నరశ్రేష్ఠునితో ( దశరథునితో) ఇట్లు పలికెను. " మహారాజా ! నీకు స్వాగతము. అదృష్ఠము పొందినవాడను. ఓ రాఘవ! వీర్యశుల్కము గెలిచిన పుత్రులిద్దరి ప్రేమను అందుకొనుడు.

దిష్ట్యా ప్రాప్తో మహాతేజా వసిష్ఠో భగవాన్ ఋషిః |
సహ సర్వైర్ద్విజశ్రేష్ఠైః దేవైరివ శతక్రతుః ||

స|| మహాతేజా భగవాన్ ఋషిః వసిష్ఠో సర్వైః ద్విజశ్రేష్ఠైః సహ శతక్రతుః దైవైః ఇవ దిష్ఠ్యా ప్రాప్తో ( అసి) ||

తా|| మహాతేజోవంతుడైన,భగవాన్ ఋషి వశిష్ఠుడు ద్విజ శ్రేష్ఠులతో ఇఅచటికి వచ్చుట వలన అదృష్ఠము పొందిన వాడను.

దిష్ట్యా మే నిర్జితా విఘ్నా దిష్ట్యా మే పూజితం కులం |
రాఘవై స్సహ సంబంధాత్ వీర్యశ్రేష్ఠైర్మహాత్మభిః ||

స|| వీర్య శ్రేష్టైః మహాత్మభిః రాఘవైః సహ సంబంధాత్ దిష్ట్యా మే నిర్జితా విఘ్నా | మమకులం పూజితం ||

తా|| పరాక్రమవంతులలో శ్రేష్ఠులు మహాత్ములు అగు రఘువంశజులతో సంబంధము వలన అదృష్ఠముతో విఘ్నములన్నీ పోయినవి. మా కులము సుపూజితమైనది.

శ్వః ప్రభాతే నరేంద్రేంద్ర నిర్వర్తయితుమర్హసి |
యజ్ఞాస్యాంతే నరశ్రేష్ఠ వివాహం ఋషి సమ్మితమ్ ||

స|| స్వః ప్రభాతే యజ్ఞస్య అన్తే ఋషి సమ్మితం నరశ్రేష్ఠ వివాహం నిర్వర్తయితు మర్హసి ||

తా|| రేపు ఉదయము యజ్ఞము యొక్క సమాప్తము అయినపుడు ఈ నరశ్రేష్ఠుని వివాహము చేయతగును.

తస్య తద్వచనం శ్రుత్వా ఋషిమధ్యే నరాధిపః |
వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠః ప్రత్యువాచ మహీపతిమ్ ||

స|| ఋషి మధ్యే తస్య తద్ వచనం శ్రుత్వా వాక్యవిదాం శ్రేష్ఠః నరాధిపః మహీపతిం వాక్యం ప్రత్యువాచ ||

తా|| ఋషి మధ్యలో ఆయొన యొక్క ఆ మాటలను విని మాటలలో శ్రేష్ఠుడైన ఆ నరాధిపుడు ఆ రాజుతో ఇట్లు పలికెను.

ప్రతిగ్రహో దాతృవశః శ్రుతమే తన్మయా పురా |
యథా వక్ష్యసి ధర్మజ్ఞ తత్కరిష్యామహే వయమ్ ||

స|| పురా మయా ప్రతిగ్రహో దాతృవశః ఇతి మే శ్రుత | హే ధర్మజ్ఞ ! వయం తత్ యథావక్ష్యసి తత్ కరిష్యామహే |

తా|| పూర్వకాలములో ప్రతిగ్రహణము తీసుకొనువాడు ఇచ్చువాడి అధీనములో వుంటాడు అని నేను వింటిని . ఓ ధర్మజ్ఞ! నీవు ఏమి చెప్పెదవో అదేవిథముగా చెసెదను.

ధర్మిష్టం చ యశస్యం చ వచనం సత్యవాదినః |
శ్రుత్వా విదేహపతిః పరం విస్మయమాగతః ||

స|| సత్యవాదినః ధర్మిష్టం యశస్యం చ వచనం శ్రుత్వా విదేహపతిః పరం విస్మయం ఆగతః||

తా|| సత్యవాది ధర్మిష్ఠుడగు ఆరాజుయొక్క యశస్కరమైన మాటలను విని మిథిలాధిపతి కి చాలా ఆశ్చర్యమువేసెను.

తతస్సర్వే మునిగణాః పరస్పర సమాగమే |
హర్షేణ మహతా యుక్తాః తాం నిశామవసన్ సుఖమ్||

స|| తతః సర్వే మునిగణాః పరస్పర సమాగమే మహతా హర్షేణ యుక్తాః | తాం నిశాం సుఖం అవసన్ ||

తా|| అప్పుడు అన్ని మునిగణములు పరస్పరము కలిసికొని అత్యంత ప్రేమతో ఆరాత్రిని గడిపిరి.

అథ రామో మహాతేజా లక్ష్మణేన సమం యయౌ |
విశ్వామిత్రం పురస్కృత్య పితుః పాదావుపస్పృశన్||

స|| అథ మహాతేజా రామః విశ్వామిత్రం పురస్కృత్య లక్ష్మణేన సమం పితుః పాదా ఉపస్పృశన్ యయౌ |

తా|| అప్పుడు మహాతేజోవంతుడైన రాముడు విశ్వామిత్రునితో కలిసి లక్ష్మణునితో కలిసి తండ్రి పాదములను తాకెను.

రాజా చ రాఘవౌ పుత్త్రౌ నిశామ్య పరిహర్షితః |
ఉవాస పరమప్రీతో జనకేన సుపూజితః ||

స|| జనకేన సుపూజితః రాజా చ పుత్రౌ రాఘవౌ నిశమ్య పరిహర్షితః ఉవాస |

తా|| జనకునిచే బాగుగా పూజించబడి ఆ రాజు పుత్రులగు రామలక్ష్మణులను చూచి పరమసంతోషముతో రాత్రి గడిపెను.

జనకోs పి మహాతేజాః క్రియాం ధర్మేణ తత్త్వవిత్ |
యజ్ఞస్య చ సుతాభ్యాం చ కృత్వా రాత్రిమువాసహ||

స|| మహాతేజః జనకః అపి యజ్ఞస్య క్రియాం ధర్మేణ తత్వవిత్ సుతాభ్యాం చ (క్రియాం) కృత్వా రాత్రిం ఉవాస హ ||

తా|| మహాతేజోవంతుడైన జనకుడు యజ్ఞ క్రియలను ధర్మముగా అనుసరించి కుమార్తెల క్రియలను కూడా చేసెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ఏకోన సప్తతితమ స్సర్గః ||
సమాప్తం||
ఈ విథముగా శ్రీమద్ వాల్మీకి రామాయణములో బాలాకాండలో అరువది తొమ్మిదవ సర్గ సమాప్తము.
||ఓమ్ తత్ సత్ ||